Header Banner

దారుణం.. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న కారు.. నలుగురు మృతి!

  Thu Jun 05, 2025 10:01        India

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలంలోని ఏ.ఎస్. పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. వెంకటరావుపల్లి నుండి ముస్తాపురం గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పనుల కోసం వ్యవసాయ కూలీలు ఆటోలో వెళుతుండగా, ఏ.ఎస్. పేట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై జిల్లా మంత్రి అనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Nelloreaccident #AndhraPradesh #accident #Roadaccident #Accidentnews #AnamRamanarayanaReddy #Atmakur #PottiSriramulu #Nelloredistrict #Agriculturalworkers